English | Telugu

ముక్కు అవినాష్ ఆ టైప్‌ అంటూ ఫైరైన షేకింగ్ శేషు!

జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోతో ముక్కు అవినాష్ క‌మెడియ‌న్ గా పాపుల‌ర్ అయిన విష‌యం తెలిసిందే. జ‌బ‌ర్ద‌స్త్ లో టాప్ క‌మెడియ‌న్ ల‌లో ఒక‌డిగా కొన‌సాగుతున్న ముక్కు అవినాష్ కు బిగ్ బాస్ సీజ‌న్ 4 లో అవ‌కాశం రావ‌డంతో `జ‌బ‌ర్ద‌స్త్‌` షోకు గుడ్ బై చెప్పేసి మ‌ల్లెమాల నుంచి బ‌య‌టికి వ‌చ్చేశాడు. అయితే టీమ్ లీడ‌ర్ గా వున్న వ్య‌క్తి బ‌య‌టికి వెళ్లిపోవాలంటే త‌మ‌కు రూ. 10 ల‌క్ష‌లు క‌ట్టాల్సిందేనంటూ మ‌ల్లెమాల టీమ్ కండీష‌న్ పెట్టింది. దీంతో విధిలేక ముక్కు అవినాష్ మ‌ల్లెమాల టీమ్ కు రూ. 10 ల‌క్ష‌లు క‌ట్టేసి `జ‌బ‌ర్ద‌స్త్‌` షోకు గుడ్ బై చెప్పేశాడు.

దీన్నీ జీర్ణించుకోలేని ముక్కు అవినాష్ చాలా సంద‌ర్బాల్లో మల్లెమాల టీమ్ పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు. తాజాగా షేకింగ్ శేషు... ముక్కు అవినాష్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇలాంటి వ్యక్తులు త‌ల్లిపాలు తాగి రొమ్ముగుద్దే టైపు అంటూ ముక్కు అవినాష్ పై ఫైర‌య్యాడు. మ‌ల్లెమాలతో విభేధాలు వుంటే వ్య‌క్తిగ‌తంగా చూసుకోవాలి కానీ ఇలా ప‌బ్లిక్ చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాదంటూ అవినాష్ కు చుర‌క‌లంటించారు.

ఓ యూట్యూబ్ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో షేకింగ్ శేషు మాట్లాడుతూ మ‌నం ఎక్క‌డ వున్నా ఏ స్థాయిలో వున్నా ఎవ‌రి వల్ల ఎదిగాం అనే విష‌యాన్ని మ‌రిచిపోకూడ‌ద‌ని, వాళ్లలో లోపాలు ఉంటే ఆఫీస్ కి వెళ్లి చెప్పాలి త‌ప్పితే ప‌బ్లిక్ కాకూడ‌దన్నారు. 'అలాంటి వాళ్ల‌ని త‌ల్లిపాలు తాగి రొమ్ముగుద్దే ర‌కాల‌ని అంటారు. ఎందుకంటే నువ్వు ఎదిగింది అక్క‌డ‌, పెరిగింది అక్క‌డ‌... అలాంటి సంస్థ గురించి త‌ప్పుగా చెప్ప‌డం త‌ప్పు. నీకు నిజంగా అన్యాయం జ‌రిగితే న్యాయం చేయ‌మ‌ని అడ‌గాలి. సోకాల్డ్ జ‌బ‌ర్ద‌స్త్ ఆర్టిస్ట్ లు అంద‌రూ ఇంతింత సంపాదించి ఇల్లు క‌ట్టుకున్నారంటే కేవ‌లం మ‌ల్లెమాల వ‌ల్లే. అలాంటి త‌ల్లి గురించి త‌ప్పుగా మాట్లాడ‌టం త‌ప్పు` అంటూ ఫైర‌య్యారు షేకింగ్ శేషు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.